“వాల్తేరు వీరయ్య” నుంచి ‘మాస్’ ట్రీట్ రాబోతోందా?

“వాల్తేరు వీరయ్య” నుంచి ‘మాస్’ ట్రీట్ రాబోతోందా?

Published on Nov 12, 2022 7:00 AM IST

ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి రానున్న పలు క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో దర్శకుడు కె ఎస్ రవీంద్ర తో మెగాస్టార్ చిరంజీవి అలాగే మాస్ మహారాజ రవితేజ కాంబోలో వస్తున్న ఓ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మరి మెగా మరియు మాస్ మహారాజ రవితేజ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుండగా ఇప్పుడు దీనిపై ఓ క్రేజీ అప్డేట్ తెలుస్తుంది.

మరి మేకర్స్ అయితే మెగాస్టార్ ని వాల్తేరు వీరయ్య పరిచయం చేస్తూ టైటిల్ టీజర్ ని రిలీజ్ చెయ్యగా ఇక ఇప్పుడు మరో ‘మాస్’ ట్రీట్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి అయితే చిత్ర యూనిట్ మాస్ మహారాజ రవితేజ పై కట్ చేసిన సాలిడ్ టీజర్ ని రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ మరికొన్ని రోజుల్లో రానుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు