నానీ మాస్ బొమ్మ నుంచి సాలిడ్ అప్డేట్ కి సిద్ధమా..?

Published on Mar 19, 2022 5:04 pm IST


నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి” ఒకటి కాగా మరొకటి దానికి కంప్లీట్ డిఫరెంట్ గా పక్కా మాస్ ఎలిమెంట్స్ తో చేస్తున్న భారీ సినిమా “దసరా”. అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాగా దీనిని దర్శకుడు ఓడెల శ్రీకాంత్ తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమా అనౌన్సమెంట్ చేసినప్పుడే నాని పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడని అందరికీ అర్ధం అయ్యిపోయింది. మరి ఇప్పుడు మేకర్స్ ఇంకో క్రేజీ మాసివ్ అప్డేట్ ని అందించారు. “స్పార్క్ ఆఫ్ దసరా” అంటూ ఒక మాస్ పోస్టర్ తో రేపు ఉదయం 11 గంటల 34 నిమిషాలకు సాలిడ్ అప్డేట్ ని రివీల్ చేస్తున్నట్టుగా తెలియజేసారు.

మరి ఈ అప్డేట్ పోస్టర్ ని నాని లుక్ ని కంప్లీట్ గా రివీల్ చెయ్యలేదు కానీ ఇది మాత్రం మాంచి మాస్ గా ఉందని చెప్పాలి. ఇక నాని అయితే వచ్చేది గ్లింప్సా లేక ఫస్ట్ లుక్ పోస్టరా లేక రెండూనా అంటూ టీజ్ చేయడం మరింత ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :