ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” నుంచి ఓ మాసివ్ క్లారిటీ రాబోతుందా?

ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” నుంచి ఓ మాసివ్ క్లారిటీ రాబోతుందా?

Published on Nov 1, 2022 12:38 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న భారీ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఆదిపురుష్ చిత్రం ఆల్రెడీ షూట్ కంప్లీట్ చేసుకోగా మరో మూడు చిత్రాలు అయితే ఆల్రెడీ సెట్స్ మీద ఉన్నాయి. మరి ప్రభాస్ నిర్విరామంగా ఈ చిత్రాల కోసం కష్టపడుతుండగా ఈ చిత్రాల్లో వరల్డ్ ప్రాజెక్ట్ గా చేస్తున్న చిత్రం “ప్రాజెక్ట్ కే” పై అయితే ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తుంది. ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే కొన్ని ప్రీ లుక్ పోస్టర్స్ రాగ వాటికి భారీ హైప్ వచ్చింది.

ఇక ఇపుడు వినిపిస్తున్న అప్డేట్ ఏమిటంటే అతి త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ డేట్ పై ఓ మాసివ్ క్లారిటీ రానున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ చిత్ర నిర్మాత అశ్వని దత్ ఆ మధ్య అప్డేట్ కూడా చెప్పారు. అయితే మరి ఇపుడు సినిమా యూనిట్ నుంచే రిలీజ్ డేట్ పై ఓ అధికారిక అనౌన్సమెంట్ రానున్నట్టుగా ఇప్పుడు టాక్. మరి ఇది ఎప్పుడు అనేది కొంచెం వేచి చూడాలి. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకోగా దీపికా పదుకొనె, అమితాబ్ లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు