“టైగర్ 3” లో సల్మాన్, షారుఖ్ పై ఈ భారీ సీక్వెన్స్.!

Published on May 19, 2023 4:00 pm IST

బాలీవుడ్ సినిమా గత కొంత కాలం నుంచి ఎదురు చూస్తున్న మాసివ్ కం బ్యాక్ ని అయితే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన “పఠాన్” తో అయితే అందుకుంది. ఇది బాలీవుడ్ కే కాకుండా షారుఖ్ కి కూడా సెన్సేషనల్ బౌన్స్ బ్యాక్ గా అయితే నిలిచింది. ఇక ఈ సినిమాతో నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ వారు తన స్పై యూనివర్స్ ని కూడా అనౌన్స్ చేసి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని “టైగర్” గా ఇంట్రెస్టింగ్ క్యామియో లో అయితే పరిచయం చేసారు.

ఇక ఇదిలా ఉండగా ఈ మాసివ్ కాంబినేషన్ మళ్ళీ సల్మాన్ “టైగర్ 3” లో అయితే కనిపిస్తారని కూడా కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈ ఇద్దరిపై టైగర్ 3 లో కూడా ఓ బర్రె సీక్వెన్స్ ని ప్లాన్ చేశారట. ఈ సీక్వెన్స్ ని ఏకంగా 30 కోట్ల వ్యయంతో అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా ఇద్దరు హీరోస్ పై ఇది బైక్ ఛేజింగ్ సీక్వెన్స్ లా ఉంటుందని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఈ క్రేజీ బజ్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :