7 కోట్లతో “టైగర్ నాగేశ్వర రావు” లో ఒక మాసివ్ సెట్..!

Published on Apr 16, 2022 6:11 pm IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పలు సాలిడ్ ప్రాజెక్ట్స్ లో దర్శకుడు వంశీ తో చేస్తున్న ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “టైగర్ నాగేశ్వర రావు” కూడా ఒకటి. రవితేజ నుంచి మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమాని మేకర్స్ రీసెంట్ గా ఉగాది సందర్భంగా లాంచ్ చేశారు. మరి ఈ సినిమాని కూడా మాస్ మహారాజ జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ అయితే ఒకటి బయటకి వచ్చింది. దీని ప్రకారం అయితే ఈ సినిమాలో ఏకంగా 7 కోట్లు ఖర్చు చేసి ఒక మాసివ్ సెట్ ని నిర్మిస్తున్నారట. అలాగే ఇది 70వ దశకంలో నాటి ఓ గ్రామం సెట్ వర్క్ అని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమాకి ఎక్కడా తగ్గకుండా చిత్ర నిర్మాతలు ఖర్చు చేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ్ సరసన నపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా అభిషేక్ అగర్వాల్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :