మిస్టర్ బాక్సాఫీస్ పై మైండ్ బ్లాకింగ్ సీక్వెన్స్ అదే!?

మిస్టర్ బాక్సాఫీస్ పై మైండ్ బ్లాకింగ్ సీక్వెన్స్ అదే!?

Published on Jul 9, 2024 10:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి అభిమానుల నుంచి మరో ట్యాగ్ కూడా ఉంది.. అదే మిస్టర్ బాక్సాఫీస్. మరి యావరేజ్, డివైడ్ టాక్ తో కూడా దుమ్ము లేపే రామ్ చరణ్ సినిమాలు సాలిడ్ హిట్ టాక్ అందుకునే భారీ లాంగ్ రన్ ని అందుకుంటాయి. ఇక దీనితో పాటుగా తన డైనమిక్ పర్శనాలిటీ తన స్క్రీన్స్ ప్రెజెన్స్ వంటివి కూడా ఆన్ స్క్రీన్ పై డామినేటింగ్ గా కనిపించడంతో కూడా అలా పిలుచుకుంటారు.

అయితే తాజాగా రామ్ చరణ్ తన భారీ సినిమా “గేమ్ ఛేంజర్” (Game Changer) విషయంలో పెట్టిన పోస్ట్ తో అయితే సోషల్ మీడియా బ్లాస్ట్ అయ్యింది. మరి మొదటి పిక్ లో అయితే షర్ట్ లెస్ గా రామ్ చరణ్ అదరగొట్టగా ఆ కాస్ట్యూమ్ లోనే శంకర్ ఒక మైండ్ బ్లాకింగ్ మాస్ సీక్వెన్స్ ని తెరకెక్కించినట్టుగా టాక్ నడుస్తుంది. లుంగీ కట్టుకొని హీరో హెలికాఫ్టర్ నడుపుకుంటూ వెళ్లి ఓ ట్రైన్ ని ఆపి విలన్స్ ని రఫ్ఫాడిస్తే ఎలా ఉంటుంది?

ఇది వింటుంటే మెగాస్టార్ ‘ఇంద్ర’ సీక్వెన్స్ గుర్తు రావడం లేదా? మరి దాని తరహాలోనే శంకర్ మార్క్ క్రేజీ సీక్వెన్స్ గా గేమ్ చేంజర్ లో చరణ్ పై డిజైన్ చేసినట్టుగా ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఇదే సీన్ కానీ సినిమాలో ఉంటే థియేటర్స్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం అని చెప్పాలి. మరి నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు కూడా ఇప్పుడిప్పుడే ఈ సినిమాపై అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు మరి ముందు రోజుల్లో సినిమాని ఎలా తీసుకెళ్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు