లేటెస్ట్..”వీరమల్లు” అప్పటికి డౌట్ లానే ఉంది.!

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం “హరిహర వీరమల్లు”. 17వ శతాబ్దం నాటి సెటప్ లో ప్లాన్ చేసిన ఈ భారీ పాన్ చిత్రంపై సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. మరి అలాగే 50 శాతం మేర షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ హిస్టారికల్ చిత్రం బ్యాలన్స్ షూట్ లో పాల్గొనేందుకు పవన్ రెడీగా ఉన్నారని నిర్మాత ఏ ఎం రత్నం తెలిపారు.

అయితే ఈ మాటల్లోనే ఈ సినిమా విడుదలపై పలు అనుమానాలు స్టార్ట్ అయ్యాయి, మొదటగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యడానికి అధికారికంగా ఫిక్స్ చేసేసారు. కానీ ఇప్పుడు మిగిలి ఉన్న షూట్ నిమిత్తం అది ఇంకా ముందుకు వెళ్లొచ్చన్న మాట కూడా ప్రస్తావనలోకి వచ్చింది. మరి ఈ భారీ చిత్రం అనుకున్న సమయానికి వస్తుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

Exit mobile version