గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రం “గేమ్ చేంజర్” (Game Changer) చేస్తున్న సంగతి తెలిసిందే. మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో చరణ్ బాధ్యతగల పాత్రల్లో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రం షూట్ ని రీసెంట్ గానే చెన్నై లో కంప్లీట్ చేసి ఇప్పుడు బాబాయ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోసం కదిలాడు.
అయితే రామ్ చరణ్ ని మెగా అభిమానులు మెగాపవర్ స్టార్, తాజాగా గ్లోబల్ స్టార్ అంటూ పిలుచుకుంటూ వస్తున్నారు. అయితే ఈరోజు పవన్ కోసం రామ్ చరణ్ పిఠాపురం (Pithapuram) ప్రయాణం కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మొదలైంది.
అయితే ఇలా మొదలు కావడంతోనే చరణ్ కి సరికొత్త ట్యాగ్ అది కూడా పొలిటికల్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పవన్ ని జనసేనాని అని పిలిస్తే చరణ్ ని ఇప్పుడు యువసేనాని అంటూ కొత్త ట్యాగ్ పెట్టేసారు. ఏదో చరణ్ కేవలం ఒక్కరోజు ప్రచారం కోసం వస్తే ఇది కాస్త ఎటెటో వెళ్లేలా ఉందని చెప్పాలి.