అఖిల్ సినిమాకి సరికొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Sep 26, 2021 12:00 pm IST

అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్”. దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది ఎట్టకేలకు థియేటర్స్ లోనే రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేశారు. అలా దసరా కానుకగా అక్టోబర్ 8న ముందు ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు మేకర్స్ నుంచి మరో సరికొత్త రిలీజ్ డేట్ ఇప్పుడు వచ్చింది.

మరి ఇక ఇప్పుడు ఈ సినిమాని ఇంకో వారం ముందుకు తీసుకెళ్లి అక్టోబర్ 15కి షిఫ్ట్ చేసి ఫిక్స్ చేసారు. సో ఈ సినిమా రిలీజ్ కి అప్పటికి ఫిక్స్ అయ్యింది గెట్ రెడీ.. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందివ్వగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మాణం వహించారు. అలాగే ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :