కోలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన సూర్య శివకుమార్ ఇప్పుడు తెలుగు, తమిళ్ లో పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో దర్శకుడు వెంకీ అట్లూరితో క్లాస్ చిత్రం విశ్వనాథ్ & సన్స్ లో నటిస్తుండగా తమిళ్ లో దర్శకుడు ఆర్ జే బాలాజీ చేస్తున్న చిత్రం “కరుప్పు”లో కూడా నటిస్తున్నారు.
మరి ఈ సినిమా పక్కా మాస్ యాక్షన్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు., వరుసగా ‘కంగువా’, ‘రెట్రో’ లాంటి డిజప్పాయింట్మెంట్ ల తర్వాత మాస్ లో హిట్ కొట్టాలని సూర్య కూడా భావిస్తున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు.
కానీ లేటెస్ట్ గా ఈ సినిమాకి ఏప్రిల్ 10 డేట్ లాక్ అయినట్టు సినీ వర్గాల్లో వినిపిస్తుంది. తమిళ్ సహా తెలుగులో అదే డేట్ లో విడుదల కానున్నట్టు తెలుస్తుంది. కానీ వీటితో పాటుగా ఈ మార్చ్ 19 లేదా 20 డేట్స్ కూడా వినిపిస్తున్నాయి. టాక్సిక్ సినిమా వాయిదా పడడంతో ఈ డేట్స్ కూడా రేస్ లోకి వచ్చాయి. మరి వీటిలో ఈ చిత్రం ఏ డేట్ లో వస్తుందో చూడాలి.
