మన టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సైంధవ్” కోసం అందరికీ తెలిసిందే. మరి మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ కూడా బాగానే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ భారీ సినిమా షూటింగ్ ఇప్పుడు ఓ పక్క శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ సినిమా రిలీజ్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది.
కానీ ఇపుడు ఈ డిసెంబర్ రిలీజ్ డేట్ కి అనుమానమే అన్నట్టుగా బజ్ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ డేట్ కి ప్రభాస్ సలార్ పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తుండడంతో “సైంధవ్” అయితే వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.