ఈటీవీలో ఈరోజు నుంచి సరికొత్త ధారావాహిక “రంగుల రాట్నం”.!

Published on Nov 17, 2021 11:55 am IST


ఎప్పటికప్పుడు సరికొత్త అలాగే వినూత్న ఎంటర్టైన్మెంట్ ని అందివ్వడంతో ఈటీవీ ఛానెల్ అలాగే మల్లెమాల ఎంటర్టైన్మెంట్ సంస్థలు ముందు వరుసలోనే ఉంటారు. తెలుగు ఆడియెన్స్ కి ఓ పక్క రంజింపజేసే ధారావాహికలు అలాగే మరోపక్క అదిరే షోలు తో మంచి ఎంటర్టైన్మెంట్ వీరి నుంచి వస్తుంది.

అయితే ఇప్పుడు తాజాగా మల్లెమాల నిర్మాణంలో తెరకెక్కుతున్న సరికొత్త కుటుంబ సమేత ధారావాహిక “రంగుల రాట్నం” ఈటీవీ ఛానెల్లో ఈరోజు నుంచి ప్రసారం కి సిద్ధంగా ఉంది. ప్రముఖ నటులు జాకీ అలాగే నటుడు చంద్ర శేఖర్ ప్రధాన పాత్రల్లో ఆసక్తికర కాన్సెప్ట్ తో ఈ ధారా వాహిక తెరకెక్కింది.

అయితే ఈ ధారావాహికను కూడా ఆల్రెడీ ఈటీవీ ఛానెల్లో హిట్ అయినటువంటి “మనసు మమత” దర్శకుడు అనీల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే దీప్తీ రెడ్డి నిర్మాణం వహించిన ఈ సీరియల్ ఈరోజు రాత్రి 7:30 నిమిషాలకు ఆరంభం కానుంది. మరి ఈ సరికొత్త ధారావాహిక ఎంతటి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుందో తెలియాలి అంటే ఈరోజు రాత్రి ఈటీవీ లో మిస్సవ్వకుండా చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :