అఫీషియల్ : “RRR” ట్రైలర్ వాయిదాపై క్లారిటీ.!

Published on Dec 1, 2021 9:58 am IST


నిన్నటి రాత్రి నుంచి కూడా ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” సినిమా తాలూకా ట్రైలర్ వాయిదా పడినట్టుగా ఓ టాక్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ ట్రైలర్ రిలీజ్ కి గాను మేకర్స్ ముందు ఈ డిసెంబర్ 3ని ఫిక్స్ చెయ్యగా ఇది అనుకున్న డేట్ కి రాబోవడం లేదని కన్ఫర్మ్ చేశారు. ఇక ఇప్పుడు దీనిపై “RRR” చిత్ర యూనిట్ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.

“కొన్ని అనివార్య కారణాల చేత “RRR” చిత్రం ట్రైలర్ ని ఈ డిసెంబర్ 3న రిలీజ్ చెయ్యడం లేదని, కొత్త డేట్ ని కూడా తాము త్వరలోనే అనౌన్స్ చేస్తామని” ఈ పోస్ట్ ద్వారా తెలియజేసారు. మరి ఈ భారీ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే అజయ్ దేవగణ్, ఆలియా భట్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :