మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే మేకర్స్ ఈ సినిమా టైటిల్ అనౌన్సమెంట్ కి సంబంధించి వదిలిన చిన్నపాటి అప్డేట్ మంచి రెస్పాన్స్ ని అందుకుంది.
మరి ఈ సినిమా తాలూకా గ్లింప్స్ ని మేకర్స్ రేపు గ్రాండ్ గా లాంచ్ చేస్తుండగా ఈ సినిమా నుంచి విజయ్ డైలాగ్ అన్నట్టు కొన్ని పవర్ఫుల్ లైన్స్ ని వదిలారు. కత్తి నేనే… నెత్తురు నాదే యుద్ధం నాతోనే…” అంటూ మరింత హైప్ ని ఫ్యాన్స్ లో ఎక్కిస్తున్నారు. దీనితో విజయ్ దేవరకొండ నుంచి మాత్రం మంచి మాస్ ట్రీట్ ఉండేలా ఉందని అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా రేపు సాయంత్రం 5 గంటలకి ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ బయటకి రానుంది.
కత్తి నేనే…
నెత్తురు నాదే
యుద్ధం నాతోనే…#VD15 will break all shackles ????????#SVC59 pic.twitter.com/9Yu5F9d05c— Sri Venkateswara Creations (@SVC_official) December 21, 2025
