పవర్ ఫుల్ టైటిల్ తో షారుఖ్, అట్లీ బిగ్ ప్రాజెక్ట్.!

Published on Sep 16, 2021 10:00 am IST


ఇండియన్ సినిమా దగ్గర మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న చిత్రాల్లో లేటెస్ట్ గా షురూ అయ్యిన సెన్సేషనల్ కాంబో అట్లీ మరియు షారుఖ్ ఖాన్ లది కూడా అని చెప్పాలి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ ల కాంబోలో ఓ సినిమా ఉంటుంది అన్నప్పుడు నుంచే అన్ని సినీ వర్గాల్లో కూడా అంచనాలు రేకెత్తాయి. అయితే ఈ భారీ చిత్రం ఇటీవలే స్టార్ట్ కాగా ఇప్పుడు ఈ సినిమాకి ఓ టైటిల్ ఫిక్స్ అయ్యినట్టుగా బజ్ బయటకి వచ్చింది.

మరి దాని ప్రకారం ఈ చిత్రంకి పవర్ ఫుల్ టైటిల్ “లయన్” ని ఫిక్స్ చేశారట. దీనితో ఈ బజ్ యిట్టె వైరల్ కాగా ఈ టైటిల్ మేకర్స్ ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా రిజిస్టర్ చేసినట్టు ఓ నోట్ కూడా బయటకి వచ్చింది. సో ఈ చిత్రానికి ఈ పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ అయ్యినట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రాల్లో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం ఇవ్వనున్నాడని బజ్ ఉంది.

సంబంధిత సమాచారం :