లేటెస్ట్..”శ్యామ్ సింగ రాయ్” స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్.!

Published on Jan 8, 2022 4:00 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై మంచి విజయాన్ని అందుకుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా సాలిడ్ వసూళ్లు అందుకొని అదరగొట్టగా ఇప్పుడు ఓటిటి లో అదరగొట్టేందుకు రెడీ అవుతుంది.

మరి ఈ సినిమా తాలూకా ఓటిటి హక్కులని దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇందులో నాని సిల్వర్ స్క్రీన్ ఈ సాలిడ్ కం బ్యాక్ ఈ జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ సినిమాలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి మరియు కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :