తెలుగు స్టేట్స్ లో భారీ లెవెల్లో “దేవర” బిజినెస్

తెలుగు స్టేట్స్ లో భారీ లెవెల్లో “దేవర” బిజినెస్

Published on Jul 5, 2024 8:56 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ లు టాలీవుడ్ డెబ్యూ ఇస్తూ చేస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే “దేవర”. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై అనేక అంచనాలు నెలకొనగా సాలిడ్ హైప్ అంతకంతకూ పెరుగుతూ వస్తుంది. అయితే ఏప్రిల్ నుంచి అక్టోబర్ కి పోస్ట్ పోన్ అయ్యిన ఈ చిత్రం నెక్స్ట్ సెప్టెంబర్ కి ప్రీ పోన్ అవ్వడం అనే చాలా కలిసి వస్తున్నట్టుగా తెలుస్తుంది.

దీనితోనే భారీ బిజినెస్ దేవర కి జరుగుతున్నట్టుగా ఆ మధ్య టాక్ కూడా వచ్చింది. అయితే పర్టిక్యులర్ మన తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమాకి ఊహించని రేంజ్ డిమాండ్ నెలకొందట. అందుకే కొన్ని కొన్ని మాస్ ఏరియాల్లో భారీ బిజినెస్ ని దేవర లాక్ చేస్తుంది అని వినిపిస్తుంది. సినిమాకి కేవలం టాక్ ఒక్కటి పడితే చాలు ఎన్టీఆర్ మాస్ యుఫోరియా సెన్సేషన్ సెట్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. మరి మొత్తానికి అయితే దేవర మ్యానియా గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు