వరల్డ్ వైడ్ మొదటి రోజు అదరగొట్టిన “ఖుషి” వసూళ్లు.!

Published on Sep 2, 2023 12:56 pm IST

మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం “ఖుషి” కోసం అందరికీ తెలిసిందే. మరి మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం సాలిడ్ పాజిటివ్ మౌత్ టాక్ ని తెచ్చుకొని విజయ్ కెరీర్ లో మరో మంచి హిట్ అండ్ కం బ్యాక్ గా అయితే నిలిచింది.

ఇక అల్రెడీ యూఎస్ లో ఇంప్రెసివ్ నంబర్స్ తో భారీ ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ కూడా అదిరే నంబర్స్ నుంచి సెట్ చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి మేకర్స్ అఫీషియల్ నంబర్స్ ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 30.1 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టి అదరగొట్టింది. చాలా మంది అయితే ఈ స్థాయి ఓపెనింగ్స్ వచ్చి ఉంటాయి అని ఊహించి ఉండకపోవచ్చు. మొత్తానికి అయితే మైత్రి మూవీ మేకర్స్ నుంచి మరో సెన్సేషనల్ హిట్ వచ్చేసింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :