రజినీ, కమల్ ప్రాజెక్ట్ కి షాకింగ్ బడ్జెట్?

rajini-kamal

ప్రస్తుతం ఒక్క సౌత్ నుంచే కాకుండా ఇండియన్ సినిమా దగ్గరే ఒక క్రేజీ మల్టీస్టారర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ లతో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి షాకింగ్ బడ్జెట్ ని మేకర్స్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో దాదాపు రెమ్యునరేషన్ లకే ఎక్కువ పోతుందట.

రూమర్స్ ప్రకారం ఈ సినిమాకి ఏకంగా 600 కోట్లు బడ్జెట్ అవుతున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. ఇందులో రజిని, కమల్ అలాగే నెల్సన్ లకే ఇందులో భారీ మొత్తం అవుతున్నట్టు టాక్. మరి ఈ చిత్రాన్ని నెల్సన్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా షూటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా మొదలు కావాల్సి ఉంది. అలాగే ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version