“పుష్ప పార్ట్ 2” కి అప్పుడే షాకింగ్ ఆఫర్ వచ్చిందా..?

Published on Jan 23, 2022 7:02 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చివేసిన లేటెస్ట్ చిత్రం “పుష్ప ది రైజ్”. మన టాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం వారి కెరీర్ లోనే సాలిడ్ హిట్ గా నిలవడమే కాకుండా టోటల్ పాన్ ఇండియన్ మార్కెట్ దగ్గరే రీసౌండింగ్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా ప్లాన్ చేసిన “పుష్ప ది రూల్” పార్ట్ 2 కి కూడా మరింత క్రేజ్ నెలకొంది.

అయితే ఈ భారీ సినిమా ఇంకొన్ని నెలల్లో షూటింగ్ స్టార్ట్ చేసుకోనుండగా దీనిపై ఓ ఊహించని బజ్ తెలుస్తుంది. ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాని ఈ సినిమాకి ఏకంగా 400 కోట్ల మేర ఆఫర్ ని ఓ ప్రముఖ ఓటిటి సంస్థ అందించిందట. కానీ మేకర్స్ అందుకు చెప్పేశారట. ఇందులో ఎంత మేర నిజముందో కానీ ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వని సినిమాకి 400 కోట్లతో ఆఫర్ అంటే సెన్సేషన్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :