లేటెస్ట్..”RRR” ట్రైలర్ ఫీస్ట్ పై మరింత క్లారిటీ ఇదే.!

Published on Nov 25, 2021 11:57 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి కస్టపడి మూడేళ్ళ పాటు చేసిన భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఎనలేని అంచనాలను నెలకొల్పుకున్న ఈ బిగ్గెస్ట్ ఇండియన్ యాక్షన్ డ్రామా రిలీజ్ కి దగ్గర అవుతున్నందున చిత్ర యూనిట్ నెవర్ బిఫోర్ ప్రమోషన్స్ ని షురూ చేశారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ట్రైలర్ కట్ ను చూడాలని ఎప్పుడు నుంచో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఓ టాక్ అయితే వైరల్ అవుతుంది కానీ ఇప్పుడు దీనిపై ఓ సాలిడ్ క్లారిటీ తెలుస్తుంది. ఈ మహా ట్రైలర్ ఫీస్ట్ వచ్చే డిసెంబర్ మొదటి వారంలోనే ఉంటుందట. డేట్ ఎప్పుడు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఫస్ట్ వీక్ లోనే “RRR” మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రిలీజ్ ఉంటుందని ఖరారు అయ్యింది. మరి ఈ ఎగ్జైటింగ్ అప్డేట్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :