“వలిమై” భారీ వసూళ్ల పై నిర్మాత క్లారిటీ.!

Published on Mar 24, 2022 8:00 am IST


కోలీవుడ్ బిగ్ స్టార్స్ లో ఒకరైన థలా అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వలిమై”. దర్శకుడు వినోద్ తెరకెక్కించిన ఈ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం గత ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి అజిత్ కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. భారీ బిజినెస్ మరియు భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం మన తెలుగులో కూడా మంచి పెర్ఫామెన్స్ ని కనబరిచింది.

అయితే ఈ సినిమా అజిత్ నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఓపెనింగ్స్ కూడా తమిళనాట రికార్డు స్థాయిలోనే వచ్చాయి. అయితే ఈరోజు నుంచి ఈ చిత్రం ఓటిటి ప్రీమియర్ గా జీ5 లో స్ట్రీమింగ్ కి వస్తుండడంతో ఈ సినిమా నిర్మాత అయినటువంటి బోనీ కపూర్ అధికారికంగా ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది అని కన్ఫర్మ్ చేశారు.

దీనితో వలిమై బాక్సాఫీస్ ఫైనల్ రన్ కోసం చూస్తున్న వారికి స్వయంగా నిర్మాత నుంచే క్లారిటీ వచ్చినట్టు అయ్యింది. ఇక ఈ చిత్రంలో హుమా ఖురేషి ఫీమేల్ లీడ్ లో నటించగా మన టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ గా నటించాడు. ఒకవేళ ముందు గాని ఈ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ గాని మిస్ అయితే ఈసారి ఓటిటి మిస్సవ్వకండి.

సంబంధిత సమాచారం :