లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన అవైటెడ్ ప్రేమ కథా చిత్రమే “తండేల్”. మరి చైతు కెరీర్లోనే భారీ బడ్జెట్ సహా అధిక అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా వాటిని అందుకునేలా టాక్ రాబట్టి సాలిడ్ బుకింగ్స్ నమోదు చేస్తుంది.
ఇలా డే 1 కి మంచి వసూళ్లు ఈ సినిమా అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాల్లో టాక్ ఉండగా ఇపుడు కొన్ని ఎర్లీ ఎస్టిమేషన్స్ తెలుస్తున్నాయి. వీటి ప్రకారం తండేల్ ఈజీగా 16 నుంచి 17 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుని అదరగొట్టినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై మేకర్స్ ఇచ్చే అధికారిక ప్రకటన ఎమన్నా వస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ హైలైట్ మ్యూజిక్ అందించగా బన్నీ వాసు నిర్మాణం వహించారు.