భారీ యాక్షన్ లో “గుంటూరు కారం”..

Published on Sep 21, 2023 8:07 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్స్ శ్రీ లీల అలాగే మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ డ్రామా “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో అంచనాలు ఆల్రెడీ పీక్స్ లో ఉండగా సినిమా నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ కూడా మంచి అంచనాలు పెంచాయి. ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా అయితే ఇప్పుడు ఓ క్రేజీ యాక్షన్ షూట్ లో బిజీగా వుంది.

ఫుల్ గన్స్ అండ్ కత్తులతో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు డిజైన్ చేసిన ఈ సీన్ పలు రోజులు నుంచి షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఈ టోటల్ సీక్వెన్స్ ఔట్ పుట్ అదిరే లెవెల్లో వచ్చిందని టాక్. మరి బిగ్ స్క్రీన్స్ లో త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ లో మహేష్ ప్రెజెన్స్ ఏ లెవెల్లో పండుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :