“పుష్ప 3” కి పరిశీలనలో సాలిడ్ టైటిల్..?

“పుష్ప 3” కి పరిశీలనలో సాలిడ్ టైటిల్..?

Published on Oct 28, 2022 7:02 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “పుష్ప” కోసం అందరికి తెలిసిందే. మరి పుష్ప కి ఇప్పుడు కొనసాగింపుగా ఇప్పుడు పుష్ప ది రూల్ ని మేకర్స్ తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు దీనిపై కూడా నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ మరింత గ్రాండ్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తుండగా ఇక ఈ చిత్రానికి కూడా మళ్ళీ కొనసాగింపుగా పుష్ప పార్ట్ 3 కూడా ఉందని అప్పుడు బయటకొచ్చిన టాక్ సెన్సేషన్ గా మారింది.

మరి ఇప్పుడు అయితే పుష్ప మూడో సినిమాకి ఓ సాలిడ్ టైటిల్ ని మేకర్స్ అనుకుంటున్నట్టుగా కొన్ని రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. పుష్ప 1 కి పుష్ప ది రైజ్, ఇప్పుడు రెండో పార్ట్ కి పుష్ప ది రూల్ కాగా ఇప్పుడు మూడో పార్ట్ కి “పుష్ప ది ర్యాంపేజ్” గా ఉండొచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై సరైన సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు