టాక్.. “మాస్ జాతర” నుంచి సాలిడ్ ట్రీట్ రాబోతోందా!

టాక్.. “మాస్ జాతర” నుంచి సాలిడ్ ట్రీట్ రాబోతోందా!

Published on Jan 21, 2025 2:00 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మాస్ జాతర” కూడా ఒకటి. తన హిట్ సినిమా “ధమాకా” బ్యూటీ శ్రీలీల మరోసారి మాస్ మహారాజ్ సరసన నటిస్తుంది. అయితే ఈ చిత్రం మళ్ళీ రవితేజ నుంచి ఒక వింటేజ్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుంది అని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండగా ఇపుడు ఓ సాలిడ్ అప్డేట్ ఈ చిత్రంపై వినిపిస్తుంది.

దీనితో ఈ రానున్న జనవరి 26 రవితేజ బర్త్ డే కానుకగా టీజర్ కట్ ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా త్వరలోనే రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏ చిత్రానికి రవితేజ సినిమాతోనే పరిచయం అయ్యిన సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ మే 1న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు