లేటెస్ట్..”అఖండ” నుంచి అదిరే ట్రీట్ రెడీ అవుతుందా?

Published on Oct 31, 2021 4:30 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ ఫా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “అఖండ” కోసం అందరికీ తెలిసిందే. అభిమనులు ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని సరైన డేట్ కోసం చూస్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ గ్యాప్ లో ఈ చిత్రం నుంచి అదిరే ట్రీట్ రాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

దీని ప్రకారం ఈ దీపావళికి “అఖండ” నుంచి ఓ సాలిడ్ టీజర్ రిలీజ్ కాబోతుంది. దీపావళి కానుకగా చిత్ర యూనిట్ దీనిని ప్లాన్ చేస్తున్నట్టు నయా బజ్. మరి దీనిలో ఎంత మేర నిజముందో కానీ నిజం అయితే ఈ టైం లో బాలయ్య అభిమానులకు కాస్త ఊరటనిచ్చేదే అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More