రవితేజ “రావణాసుర” నుంచి దీపావళి ట్రీట్ కి టైం ఫిక్స్.!

రవితేజ “రావణాసుర” నుంచి దీపావళి ట్రీట్ కి టైం ఫిక్స్.!

Published on Oct 23, 2022 1:30 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తాను ఏకకాలంలో చేస్తున్న సాలిడ్ చిత్ర “రావణాసుర” కూడా ఒకటి. యంగ్ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఒక యూనిక్ కాన్సెప్ట్ తో అయితే తెరకెక్కుతుంది. మరి ఈ భారీ చిత్రం షూటింగ్ దాదాపు దగ్గర పడుతుండగా మేకర్స్ అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.

ఈ దీపావళి కానుకగా అయితే ఈ చిత్రం నుంచి రేపు ఓ మాసివ్ అప్డేట్ ఇస్తున్నట్టు తెలిపారు. మరి ఇది రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పలు పోస్టర్స్ ఆసక్తిగా రేపగా రేపు ఏమొస్తుందో అనేది చూడాలి. ఇక ఈ చిత్రంలో అయితే అను ఇమ్మానుయేల్, ఫరియా, మేఘ ఆకాష్ అలాగే దక్ష నగర్కర్ లు ఫీమేల్ లీడ్ లో కనిపించనుండగా దీనికి కూడా భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు