లేటెస్ట్ : “ఎన్టీఆర్ 30” పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

లేటెస్ట్ : “ఎన్టీఆర్ 30” పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

Published on Nov 6, 2022 1:10 PM IST

మన టాలీవుడ్ మాసెస్ట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న తన 30 వ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలిసిందే. దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ రెండో సారి చేయనున్న సినిమా ఇది కావడం అలాగే దీనికి ముందు ఎన్టీఆర్ RRR తో భారీ క్రేజ్ సొంతం చేసుకోవడంతో కొరటాలకి లాస్ట్ చిత్రం పరాజయం ఉన్నా కూడా ఎన్టీఆర్ ఈ సినిమాపై భారీ క్రేజ్ ని తీసుకొచ్చి పెట్టాడు. మరి ఎప్పుడో ఈ సినిమాపై అప్డేట్ ఇచ్చి తర్వాత అలా డిలే కనిపిస్తూ వస్తుంది.

ఇక ఫైనల్ గా అయితే ఫ్యాన్స్ లో ఉన్న అనుమానాలు క్లియర్ చేస్తూ మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ ని ఇచ్చారు. దర్శకుడు కొరటాల అలాగే రత్నవేలు మరియు సాబు సిరిల్ లు కలిసి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఈ పనులన్నీ శరవేగంగా కంప్లీట్ అవుతున్నట్టు అయితే తెలిపారు. మొత్తానికి అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ పెద్ద డౌట్ తీరింది అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు