పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ సినిమాల్లో సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో చేస్తున్న పక్కా మాస్ యాక్షన్ డ్రామా స్పిరిట్ కూడా ఒకటి. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా షూట్ ఇంకా చాలానే బాకీ ఉంది. అయితే ఈ సినిమా షూట్ మళ్లీ పునఃప్రారంభం కానుంది. ఇక లేటెస్ట్ గా ప్రభాస్ బర్త్ డే బ్లాస్ట్ గా సాలిడ్ ట్రీట్ ని ఈసారి సందీప్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలో వచ్చినట్టు కేవలం ఆడియో గ్లింప్స్ బ్యాడ్ హాబిట్ లా కాకుండా ఈసారి. నేరుగా ప్రభాస్ పైనే ఓ ఇంట్రెస్టింగ్ యాక్షన్ గ్లింప్స్ తో పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది. సో మిగతా సినిమాలు సంగతి అటుంచితే స్పిరిట్ నుంచి మాత్రం క్రేజీ ట్రీట్ రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా రీసెంట్ హిట్ రోమాంచకం నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్నారు.
