టాక్.. “పుష్ప 2” నుంచి ఆరోజు స్పెషల్ ట్రీట్?

టాక్.. “పుష్ప 2” నుంచి ఆరోజు స్పెషల్ ట్రీట్?

Published on Jun 23, 2024 9:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా రిలీజ్ ఇటీవలే వాయిదా వేసినట్టుగా మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ పలు అప్డేట్స్ కూడా రాగా ఫ్యాన్స్ కి మంచి ట్రేట్ ఇచ్చాయి.

అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఈ సినిమా విషయంలో వైరల్ గా మారింది. పుష్ప సినిమా ఏదైతే ఆగస్ట్ 15 నుంచి వాయిదా పడిందో అదే రోజున ఒక స్పెషల్ ట్రీట్ ని అయితే అభిమానులకి అందించబోతున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ డిసెంబర్ 6న సినిమా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు