ఆరోజున ప్రభాస్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఫిక్స్ ?

Published on Mar 29, 2023 2:21 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ మూవీని రిట్రో ఫైల్స్ సంస్థ తో కలిసి టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఎంతో భారీ వ్యయంతో నిర్మించగా ఇందులో రాఘవగా ప్రభాస్, సీత గా కృతి సనన్, లంకేశ్ గా సైఫ్ ఆలీ ఖాన్, లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటించారు.

మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ గ్రాండియర్ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుని అంచనాలు మరింతగా పెంచింది. అయితే విషయం ఏమిటంటే మరొక రెండు రోజుల్లో శ్రీరామనవమి సందర్భంగా ఆదిపురుష్ నుండి ఒక అప్ డేట్ అయితే రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అప్పటి నుండి మూవీ యొక్క ప్రమోషన్స్ ని వేగవంతం చేయాలని యూనిట్ కూడా భావిస్తోందట. కాగా ఈ మూవీ జూన్ 16న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :