చరణ్ మరో భారీ ప్రాజెక్ట్ పై రాజమౌళి కామెంట్స్ వైరల్.!

Published on Dec 28, 2021 7:05 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ లైనప్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్న సంగతి కూడా మనం చూస్తున్నాం. యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ తో చరణ్ సినిమాలు చేయబోతున్నాడు. అయితే లేటెస్ట్ గా జరిగిన మీడియా ఇంట్రాక్షన్ లో చరణ్ చేయబోయే ఓ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి దర్శకుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం ఇప్పుడు వైరల్ అవుతుంది.

అది కూడా మరెవరో కాదు మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తో సినిమా పై చెప్పడం జరిగింది. ఈ కాంబో సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ కోసం తనకి తెలుసని కానీ దాన్ని రివీల్ చేయనని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీనితో ఇవి ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అలాగే సుకుమార్ కాంబోలో మళ్లీ “రంగస్థలం” తర్వాత సినిమా చరణ్ చెయ్యబోతున్నాడని ఈ టాక్ ఇప్పుడు కన్ఫర్మ్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :