‘వాల్తేరు వీరయ్య’ విజయ విహార వేడుకలో తొక్కిసలాట

Published on Jan 28, 2023 9:50 pm IST

మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న విడుదలైన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కొల్లి బాబీ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికీ కూడా ఎన్నో ప్రాంతాల్లో సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళుతోంది వాల్తేరు వీరయ్య మూవీ. మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈమూవీలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర చేసారు.

ఇక తమ మూవీని ప్రేక్షకాభిమానులు ఇంత పెద్ద సక్సెస్ చేయడంతో వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపేందుకు నేడు వాల్తేరు వీరయ్య యూనిట్ వరంగల్ హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రత్యేకంగా భారీ విజయ విహారం ఈవెంట్ ని ఎంతో గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేసారు. అయితే కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయిన ఈ ఈవెంట్ కి భారీ స్థాయిలో ఫ్యాన్స్, ఆడియన్స్ తరలిరావడంతో అక్కడ కొంత తొక్కిసలాట జరిగింది. అయితే ఎవరికీ పెద్దగా ప్రమాదమేమీ లేదని, కాకపోతే కొందరికి కొద్దిపాటి చిన్న గాయాలయ్యాయని తెలుస్తోంది. అయితే ఇంత భారీ స్థాయిలో ప్రేక్షకాభిమానులు వాల్తేరు వీరయ్య విజయ విహారం ఈవెంట్ కి తరలి రావడంతో అందరూ జాగ్రత్తగా ఉండడంతో పాటు ఈవెంట్ అనంతరం మరింత జాగ్రత్తగా క్షేమంగా తమ తమ ఇంటికి తిరిగి చేరుకోవాలని మూవీ యూనిట్ కోరుతోంది.

సంబంధిత సమాచారం :