యూఎస్ మార్కెట్ లో కూడా “కల్కి” స్టడీ సెన్సేషన్.!

యూఎస్ మార్కెట్ లో కూడా “కల్కి” స్టడీ సెన్సేషన్.!

Published on Jul 3, 2024 3:30 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో లేటెస్ట్ గా చేసిన భారీ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం విడుదల అయ్యిన నాటి నుంచే సెన్సేషల్ వసూళ్లు నమోదు చేస్తుండగా ఒక్క ఇండియా లోనే కాకుండా ఈ చిత్రం యూఎస్ మార్కెట్ లో కూడా భారీ స్థాయి వసూళ్లు కొల్లగొడుతుంది.

నార్త్ అమెరికాలో సినిమా విడుదల కాక ముందే మిలియన్స్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసేసి ఇప్పుడు అక్కడ కూడా వీక్ డేస్ లోకి వచ్చింది. మరి అక్కడ కూడా ఈ వీక్ డేస్ లో సినిమా భారీ వసూళ్లు నమోదు చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి మొదటి సోమవారం కల్కి 8లక్షల 43 వేల డాలర్స్ కి పైగా వసూళ్లు రాబట్టగా ఆ నెక్స్ట్ డే మంగళవారం కూడా కల్కి 8లక్షల డాలర్స్ కి పైగా రాబట్టి ఒక స్టడీ అండ్ సెన్సేషనల్ వసూళ్లతో దూసుకెళ్తుంది అని చెప్పాలి.

ఇలా ఈ అన్ని రోజుల్లో ఇప్పుడు వరకు సినిమా 12.83 మిలియన్ డాలర్స్ గ్రాస్ కి చేరుకొని 13 మిలియన్ డాలర్స్ మార్క్ ని టచ్ చేయనుంది అని చెప్పాలి. మరి లాంగ్ రన్ లో కల్కి హవా ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు