“కల్కి” నుంచి దిశాపై స్టన్నింగ్ పోస్టర్ వదిలిన మేకర్స్

“కల్కి” నుంచి దిశాపై స్టన్నింగ్ పోస్టర్ వదిలిన మేకర్స్

Published on Jun 13, 2024 10:43 AM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకోణ్ అలాగే దిశా పటాని హీరోయిన్స్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో భారీ అంచనాలు ఈ సినిమాపై నెలకొనగా ఈ ట్రైలర్ లోనే హీరోయిన్ దిశా పటాని పై మరింత క్లారిటీ అందరికి వచ్చింది.

అయితే నేడు ఆమె బర్త్ డే కానుకగా మేకర్స్ ఒక స్టన్నింగ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె రోక్షి గా కనిపిస్తుంది అని తన రోల్ ని కూడా రివీల్ చేశారు. మరి ఈమె ట్రైలర్ లో కనిపించిన లుక్స్ తోనే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక దీనితో పాటుగా ఆమె తన హాట్ ఫిజిక్ తో ఫ్యాన్స్ కి ఈ సినిమాలో మెస్మరైజ్ చేయబోతుంది అని అర్ధం అవుతుంది.

మొత్తానికి అయితే కల్కి లో దిశా అదరగొట్టనుంది అని చెప్పాలి. మరి ఈ భారీ సినిమాలో కమల్ హాసన్ (Kamal Haasan), అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) లాంటి దిగ్గజాలు కూడా నటిస్తుండగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జూన్ 27న గ్రాండ్ గా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు