ఇటీవల కాలంలో మన తెలుగు ఆడియెన్స్ లో సూపర్ హిట్ అయ్యిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాల్లో అక్కినేని నాగార్జునతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన ( soggade chinni nayana ) కూడా ఒకటి. కింగ్ నాగార్జునని మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది. ఇక ఈ సీక్వెల్ తర్వాత మరో సినిమా కూడా వుంటుంది అని కన్ఫర్మ్ చేశారు కానీ దీనిపై అప్పుడు నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.
కానీ అక్కినేని ఫ్యాన్స్ కి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక సర్ప్రైజ్ అప్డేట్ ఇప్పుడు వచ్చేసింది. సోగ్గాళ్ళు మళ్లీ వస్తున్నారు అంటూ నెక్స్ట్ పార్ట్ పై సర్ప్రైజ్ అప్డేట్ ని వారు అందించారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 15న సందడి చేసేందుకు వస్తున్నట్టు ఖరారు చేసేసారు. ఇది మాత్రం అక్కినేని ఫ్యాన్స్ కి ఒక సర్ప్రైజ్ చేసే గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ ఫ్రాంచైజ్ కి మంచి ఆదరణ ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఉంది. ఇక నెక్స్ట్ రానున్న సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.
వాసివాడి తస్సాదియ్యా 💫✨వచ్చే 15th జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ గా ఉంటాది కదా💥 🔥🔥 డేట్ మార్క్ చేసుకోండి 🤩
— Annapurna Studios (@AnnapurnaStdios) February 8, 2026
