పవన్ తో కలిసి “వీరమల్లు” పై స్వీట్ షాకిచ్చిన కీరవాణి.!

Published on Sep 30, 2022 12:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన కెరీర్ లోనే మంచ్చి మోస్ట్ అవైటెడ్ గా ఉన్నటువంటి చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ చిత్రంలో పవన్ మొదటిసారి ఒక వారియర్ లుక్ లో కనిపించనున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఆల్రెడీ మంచి అంచనాలు కూడా నెలకొనగా పవన్ ఈ సినిమా షూటింగ్ విషయంలో మళ్ళీ దృష్టి సారించినట్టుగా ఇప్పుడు క్లియర్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు మంచి వైరల్ గా మారిపోయింది.

హరిహర వీరమల్లు చిత్రం వర్క్ షాప్స్ ఇప్పుడు స్టార్ట్ చేశామని నవ రాత్రుల్లో నవ ఉత్తేజం అంటూ స్టైలిష్ లుక్ లో పవన్ ఫోటో షేర్ చేసి తెలియజేసారు. దీనితో ఈ స్వీట్ షాకింగ్ పోస్ట్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారిపోయింది. ఇక సినిమా షూటింగ్ అయితే ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :