ఇంట్రెస్టింగ్..”కేజీయఫ్ 2″ లో ఈ వింటేజ్ సూపర్ హిట్ సాంగ్?

Published on Dec 29, 2021 1:00 pm IST

ప్రస్తుతం దక్షిణాది సినిమా నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం కూడా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉండగా ఈ గ్యాప్ లో ప్యాచ్ వర్క్స్ ని మేకర్స్ కంప్లీట్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఒక ఎగ్జైటింగ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఒక వింటేజ్ సూపర్ హిట్ ట్రాక్ ని రీమిక్స్ చేసారని సమాచారం వైరల్ అవుతుంది. ఆ సాంగ్ మరేదో కాదట ఇండియన్ సినిమా దగ్గర ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఒకటైన బాలీవుడ్ చిత్రం షోలే సినిమాలో “మెహబూబా మెహబూబా” సాంగ్ ని అట.

ఈ సాంగ్ ని హైదరాబాద్ లోనే షూటింగ్ కూడా చేశారట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. అలాగే ఈ సాంగ్ టోటల్ ఇండియన్ వెర్షన్ కి సెట్ చేసారా లేక సౌత్ వెర్షన్ కి ముందు చాప్టర్ 1 లా హిందీ వెర్షన్ కి వేరేగా ప్లాన్ చేసారా అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :