“ఇండియన్ 2” రిలీజ్ ముందు వింటేజ్ ట్రీట్ ప్లానింగ్?

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ఇప్పుడు నటించిన అవైటెడ్ చిత్రం “ఇండియన్ 2” కోసం తెలిసిందే. మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం తమ కెరీర్ లో మొదటి సినిమా “ఇండియన్” కి సీక్వెల్ గా ఇన్నేళ్ల తర్వాత రాబోతుంది. దీనితో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కొందరు ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఇండియన్ 2 రిలీజ్ ని మేకర్స్ ఈ ఏడాది జూన్ కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ రిలీజ్ కి ముందు మేకర్స్ వింటేజ్ ట్రీట్ ఇచ్చేలా “ఇండియన్” రీరిలీజ్ ని తీసుకొస్తున్నారట. ఇప్పుడు ఎలాగో కొత్త సినిమాలు లేవు రీ రిలీజ్ లు ఎక్కువగా వస్తున్నాయి. అలా ఇండియన్ మొదటి భాగాన్ని ఈ మే నెలలో చివర వారంలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఇండియన్ 2 లో కాజల్, రకుల్, సిద్ధార్థ్ తదితరులు నటించగా అనిరుద్ సంగీతం అందించాడు అలాగే లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

Exit mobile version