ఫస్ట్ హాకీ ఫిలిం ఫస్ట్ లుక్ రేపే

Sundeep Kishan

యంగ్ హీరో సందీప్ కిషన్ చేస్తున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. హాకీ గేమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డెన్నిస్ జీవన్ కనుకొలను డైరెక్ట్ చేస్తున్నాడు. హాకీ నేపథ్యంలో రూపొందుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే. అందుకే సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ రేపు ఉదయం 9: 09 గంటలకు రిలీజ్ కానుంది. ఈ చిత్రం మీద సందీప్ కిషన్ చాలా ఆశలే పెట్టుకుని ఉన్నారు. స్పోర్ట్స్ ఫిలిం కావడంతో నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు.

ఇకపోతే ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయకిగా నటిస్తోంది. ఆమె కూడ ఇందులో హాకీ క్రీడాకారిణిగా కనిపించనుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయా పన్నెం నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను మొహాలీ స్టేడియంలో తెరకెక్కించడం జరిగింది.

Exit mobile version