సుధీర్ బాబు, కృతి శెట్టి హీరో హీరోయిన్ లుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రం ను బెంచ్ మార్క్ స్తుడియోస్ పతాకం పై మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక అప్డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది.
ఈ చిత్రం కోసం మైత్రి మూవీ మేకర్స్ టీమ్ లో జాయిన్ కావడం విశేషం. ఈ చిత్రం నిర్మాణం లో భాగం గా ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ రావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ ఒక వీడియో ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.