“ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” టీజర్ విడుదల వాయిదా

Published on Jan 17, 2022 3:00 pm IST

సుధీర్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ నేడు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల టీజర్ వాయిదా పడింది, త్వరలో టీజర్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ కి మంచి స్పందన వచ్చింది.

మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి బెంచ్‌మార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం పై చూపిస్తున్న ప్రేమ కి, మద్దతు కి చిత్ర యూనిట్ థాంక్స్ తెలిపింది.

సంబంధిత సమాచారం :