“భీమ్లా”తో పోటీకి తగ్గేదేలే అంటున్న “ఆడవాళ్లు మీకు జోహార్లు”..!

Published on Feb 16, 2022 8:00 pm IST

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు”. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ చిత్రానికి శర్వానంద్, రష్మిక ఇద్దరు నేడు డబ్బింగ్ సెషన్‌లను పూర్తి చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ విడుదల తేదీని కూడా మరోసారి ధృవీకరించారు. అయితే నిన్న “భీమ్లా నాయక్” చిత్రాన్ని ఫిబ్రవరి 25నే విడుదల చేస్తున్నట్టు మరోసారి ధృవీకరించడంతో “ఆడవాళ్లు మీకు జోహార్లు” చిత్రాన్ని వాయిదా వేస్తారని నెటిజన్లు భావించారు. కానీ తగ్గేదే లే అనంట్టుగా ఈ చిత్రాన్ని ముందుగా ప్రకటించిన తేదీనే విడుదల చేస్తున్నట్టు మేకర్స్ మరోసారి ప్రకటించారు.

సంబంధిత సమాచారం :