“ఆడవాళ్లు మీకు జోహార్లు” ఫస్ట్ డే నైజాం వసూళ్ల వివరాలు!

Published on Mar 5, 2022 12:00 pm IST

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యిన తాజా చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు”. మంచి బజ్ మరియు ప్రమోషన్స్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం కాస్త మిక్సిడ్ టాక్ ని తెచ్చుకుంది. మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నైజాం వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి.

అయితే ఈ సినిమాకి మొదటి రోజు 35 లక్షల షేర్ మొదటి రోజు వచ్చిందట. అయితే ఇది డీసెంట్ నెంబర్ అనే చెప్పాలి. అలాగే ఈ వారాంతానికి కూడా మంచి నెంబర్ అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు కానీ ఫైనల్ రన్ లో ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సీనియర్ నటులు ఖుష్బూ మరియు రాధికా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :