నాని “దసరా” ట్రైలర్ పై ఆది పెనిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Mar 16, 2023 6:30 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో, నాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. మార్చ్ 30 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. రిలీజైన దసరా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

ఈ ట్రైలర్ పై తాజాగా నటుడు ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దసరా ట్రైలర్ రియల్, రా మరియు రస్టిక్ అని పేర్కొన్నారు. ట్రైలర్ అదిరిపోయింది అని, నాని బాబాయ్, కీర్తి సురేష్ ఇది మీ బెస్ట్ లలో ఒకటి అని అన్నారు. మార్చ్ 30 లో థియేటర్లలో విడుదల అవుతుంది. ఈ చిత్రాన్ని చూడటానికి వేచి ఉండలేను అని అన్నారు. చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఆది చేసిన పోస్ట్ వైరల్ గా మారుతోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :