ఆది పినిశెట్టి హారర్ చిత్రానికి టైటిల్ ఫిక్స్!

ఆది పినిశెట్టి హారర్ చిత్రానికి టైటిల్ ఫిక్స్!

Published on Dec 14, 2022 5:00 PM IST

ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి ఈరోజు తన 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నటీనటుల కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ నటుడు తనకు బ్లాక్ బస్టర్ మూవీ వైశాలిని అందించిన దర్శకుడు అరివళగన్ వెంకటాచలంతో చేతులు కలిపాడు.

ఈ చిత్రానికి శబ్దం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 7G ఫిల్మ్స్ మరియు ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ కంపోజర్ థమన్ సౌండ్‌ట్రాక్‌లను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు