చరణ్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న కీలక నటుడు !
Published on Apr 12, 2017 11:55 am IST


సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తునం తాజా చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే రాజమండ్రిలో మొదటి షెడ్యూల్ మొదలుపెట్టగా రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ సమంత కూడా షూటింగ్లో పాల్గొంటోంది. వారిద్దరిపై ఒక పాటను కూడా షూట్ చేశారు. ఇదిలా ఉండగా మరొక ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి కూడా షూటింగ్లో జాయిన్ అయ్యారట.

ప్రస్తుతం చరణ్, ఆది, సమంతల కాంబినేషన్లో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బన్నీ ‘సరైనోడు’ చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించిన ఆది ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడో ఇంకా తెలియాల్సి ఉంది. పాత కాలంలో జరిగే విలేజ్ లవ్ స్టోరీగా ఉండనున్న ఈ చిత్రంలో చరణ్ గుబురు గడ్డం, పంచె కట్టుతో లోకల్ మాస్ కుర్రాడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఆగష్టు లేదా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భావిస్తోంది.

 
Like us on Facebook