అదిరిపోయిన “అతిథి దేవోభవ” ట్రైలర్..!

Published on Jan 5, 2022 11:05 pm IST

యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్‌గా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అతిధి దేవోభవ’. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రాజాబాబు, అశోక్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్లు, వీడియోలు, పాటలు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. లవ్.. యాక్షన్.. ఎమోషన్స్ ట్రైలర్‌లో నిండుగా కనిపించాయి. చాలాకాలంగా సరైన హిట్ లేక కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతున్న ఆది ఈ సినిమాతోనైనా సక్సెస్‌ అందుకుంటాడా అన్నది చూడాలి మరీ.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :