ఆది “తీస్‌మార్‌ఖాన్” టీజర్‌కి ముహూర్తం ఫిక్స్..!

Published on Jun 17, 2022 12:00 am IST

యంగ్ హీరో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం “తీస్ మార్ ఖాన్. ఈ హై యాక్షన్ వోల్టేజ్ చిత్రాన్ని విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తుండగా, కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, వీడియోలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ముహూర్తాన్ని ఖరారు చేశారు. జూన్ 18వ తేది ఉదయం 11:43 నిమిషాలకు టీజర్‌ని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టూడెంట్‌గా, రౌడీగా, పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్ త్రీ షేడ్స్‌లో కనిపించబీతున్నాడు. ఇక త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :